గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం: బాధితుల కుటుంబాలకు ఇరవై లక్షల పరిహారం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Goa

గోవాలో జరిగిన భీకర నైట్ క్లబ్ అగ్నిప్రమాద ఘటనలో మృతిచెందిన ఇరవై ఐదు మంది బాధితుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు హాస్పిటాలిటీ సంస్థ స్పష్టం చేసిందని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు వివిధ విడతల్ లో పరిహారపు మొత్తాన్ని జమ చేస్తామని సంబంధిత యాజమాన్యం న్యాయస్థానానికి అంగీకారం తెలిపింది. ఉపాధ్యాయులు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది.