జేఎన్యూలో లైంగిక వేధింపుల కలకలం: ప్రొఫెసర్ పై విద్యార్థినుల సంచలన ఆరోపణలు
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ విభాగ ప్రొఫెసర్ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ పై పదకొండు మంది విద్యార్థినులు లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసినట్లు అంతర్గత కమిటీ విచారణలో వెల్లడైందని వర్సిటీ అధికారులు తెలిపారు. క్లాస్ లో చేతులు పట్టుకోవడం, ఇంటికి పిలిచి వ్యక్తిగత విషయాలు అడగడంతో పాటు ప్రొజెక్టర్ పై అభ్యంతరకర వీడియోలు చూపించారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా అక్టోబర్ తొమ్మిదిన ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.