రాష్ట్రంలో కొత్త జడ్పీల రూపకల్పన: అతి పెద్దదిగా వైఎస్సార్ కడప
రిపోర్టర్: నరేష్
స్థలం: కడప
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత జరుగుతున్న మొదటి జడ్పీ ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా అతి పెద్ద జడ్పీగా అవతరించిందని అధికారులు తెలిపారు. కొత్త వ్యవస్థలో ముప్పై తొమ్మిది గ్రామీణ మండలాలతో వైఎస్సార్ కడప అగ్రస్థానంలో నిలవగా, కేవలం నాలుగు మండలాలతో విశాఖపట్నం అతి చిన్న జడ్పీగా మిగిలిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల విభజన నేపథ్యంలో స్థానిక సంస్థల రూపురేఖలు పూర్తిగా మారాయని వెల్లడించారు.