ఐఐఎం లక్నో సరికొత్త కోర్సు: ఫ్యామిలీ బిజినెస్ ఎంబీఏ ప్రారంభం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Lucknow

వ్యాపార రంగంలో భవిష్యత్ తరాల నాయకులను తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లక్నో సరికొత్తగా రెండు సంవత్సరాల ఫ్యామిలీ బిజినెస్ ఎంబీఏ కోర్సును ప్రారంభించినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ కోర్సుకు సంబంధించి మొదటి విడత దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించామని, తదుపరి ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.