గేమ్ ఛేంజర్ మరియు ఎంథిరన్ సినిమాలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
దర్శకుడు శంకర్ సినిమాలకు సంబంధించి సంగీత దర్శకుడు తమన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రజనీకాంత్ హీరోగా వచ్చిన ఎంథిరన్ చిత్రంలోని ఓ పాట కోసం ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేయాలని ఏఆర్ రెహమాన్ భావించగా, 2009లో ఆయన ఆకస్మిక మృతితో ఆ ప్రణాళిక నిలిచిపోయింది. అలాగే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రంలోని ధోప్ పాటకు ఆంగ్ల వెర్షన్ రూపొందించి పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ను భాగం చేయాలని ప్లాన్ చేసినప్పటికీ నిర్మాణ ఆలస్యం వల్ల అది సాధ్యం కాలేదని తమన్ తెలిపారు.