బెల్లంపల్లి ఆటో యూనియన్ వినాయకునికి బియ్యం విరాళమిచ్చిన నాతరి స్వామి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమం కోసం టీపీసీసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి క్వింటాల్ బియ్యం విరాళంగా అందజేశారు. ఆటో యూనియన్ వినాయక మండపంలో సోమవారం జరగనున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.