కృత్రిమ మేధస్సుపై ప్రధాని మోదీ కీలక సందేశం: బాధ్యతాయుతమైన భవిష్యత్ దిశగా అడుగులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నిజామాబాద్

కృత్రిమ మేధస్సును మరింత బాధ్యతాయుతంగా, సమ్మిళితంగా మరియు మానవ కేంద్రీకృత విధానంతో ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని Arvind Dharmapuri వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సందేశాన్ని పంచుకుంటూ ఆయన స్పందించారు. భవిష్యత్తులో సాంకేతికతను మానవాళి అభ్యున్నతికి ఎలా ఉపయోగించాలనే అంశంపై ఈ వీడియో సందేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన పేర్కొంటూ టెక్నాలజీ రంగంలో నూతన మార్పులపై విస్తృత చర్చ జరుగుతోందని తెలిపారు.