గ్రామాల్లో పోలీసుల పల్లె నిద్ర: ప్రజలతో మమేకమైన రక్షక భటులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బాపట్ల
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో బాపట్ల పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు Bapatla Police తెలిపారు. ఈ సందర్భంగా రక్షక భటులు గ్రామాల్లోని ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేశారు.