నీట మునిగిన పంటలను పరిశీలించిన ఆర్డీవో కృష్ణమూర్తి బృందం

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి, పాలెం, గోనెడ గ్రామాల్లో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పెద్దాపురం ఆర్డీవో కృష్ణమూర్తి, ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మార్వో సాయికృష్ణతో కలిసి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపాలని సూచించారు. నీరు తొలగిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ చల్లుకోవాలని రైతులకు అవసరమైన సాగు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సురేష్, వీఏఏలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.