జన్నారం ప్రధాన రహదారిపై కూలుతున్న కల్వర్టులతో ప్రమాదాల ముప్పు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
జన్నారం మండలంలో ప్రధాన రహదారి పక్కన శిథిలావస్థకు చేరిన కల్వర్టుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళ్లపేట నుంచి ఇందన్ పల్లి వరకు వివిధ గ్రామాల మీదుగా వెళ్లే ఈ రహదారిపై పలుచోట్ల కల్వర్టుల గోడలు దెబ్బతిన్నాయి. రాత్రివేళల్లో వాహనాలు వాగుల్లో పడిపోయే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించి నూతన గోడలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.