ఎర్రసముద్రంలో హుతీల బీభత్సం: సౌదీకి పెనుముప్పుగా మారిన యెమెన్ తిరుగుబాటుదారులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

యెమెన్లో చిన్న వేర్పాటువాద సంస్థగా ప్రారంభమైన హుతీలు నేడు అత్యంత సంపన్న దేశమైన సౌదీ అరేబియాకు పక్కలో బల్లెంలా మారారని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యూహాత్మక బాబ్ ఎల్ మండబ్ జలసంధిలో తిష్టవేసిన వీరు, ఇరాన్ మద్దతుతో బలం పుంజుకుని నిరంతరం దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులు చేయడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై తీవ్ర ప్రభావం పడుతోందని, సౌదీని దెబ్బకొట్టేందుకు హుతీలు భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు.