గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కొత్త శ్రీనివాస్
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సోమవారం మంథని మండలం పుట్టపాక, చల్లపల్లి, మహబూబ్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో ఆయా గ్రామాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.