ఐపీఎల్ ట్రేడింగ్ కలకలం: ముంబై ఇండియన్స్ వీడి కేకేఆర్లోకి హార్దిక్ పాండ్యా

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

ఐపీఎల్ -2027 సీజన్ కు ముందు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడి కోల్కతా నైట్రైడర్స్లోకి మారే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే హర్షిత్ రాణా, అంగ్క్రిష్ రఘువంశీలను తమకు ఇవ్వాలంటూ ముంబై ఇండియన్స్ కొన్ని కీలక షరతులు విధించినట్లు సమాచారం. ఈ ట్రేడ్ డీల్ పై త్వరలోనే ఇరు జట్ల యాజమాన్యాల మధ్య స్పష్టత వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.