యు.కొత్తపల్లిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం స్తంభించిన ట్రాఫిక్
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: యు.కొత్తపల్లి
యు.కొత్తపల్లి మండలం గోర్స నుంచి ఆనందనగర్ వెళ్లే మార్గంలో ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షం నేలకూలింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న యు.కొత్తపల్లి ఎస్సై వెంకటేశ్ బృందం ఆర్ & బీ అధికారులతో చేరుకొని యుద్ధప్రాతిపదికన చెట్టును తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పరిస్థితిని పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.