పిచ్చాటూరులో విద్యుత్ కోతలతో ప్రజల అల్లాటప్పా.. అధికారుల తీరుపై ఆగ్రహం!

రిపోర్టర్: Balaji స్థలం: పిచ్చాటూరు

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని 23 గ్రామాల్లో రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 9:30 నుంచి 12 గంటల వరకు ముందస్తు సమాచారం లేకుండానే కరెంట్ తీసేస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

పగటి వేళల్లో కాకుండా రాత్రిపూట విద్యుత్ కోతలు విధించడం వల్ల దొంగతనాల భయం వెంటాడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాల సమయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, అధికారులు వెంటనే స్పందించి రాత్రి వేళ విద్యుత్ కోతలను నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.