తిరుమలలో బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు, బుక్లెట్ ఆవిష్కరణ
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుపతి
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. తితిదే బోర్డు సమావేశంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర బ్రహ్మోత్సవాల 2026 బుక్లెట్ను ఆవిష్కరించారు. వాహన సేవలు, ఉత్సవాల వివరాలను ఈ బుక్లెట్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.