ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ముర్ము: చరిత్రలో తొలిసారి రాక
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయవాడ
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి ఈ నెల పద్నాలుగో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన దసరా ఉత్సవాల ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడికి రాష్ట్రపతి హోదాలో విచ్చేస్తున్న తొలి వ్యక్తి ముర్మునేనని పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత, సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన దిశానిర్దేశం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.