జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం: జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో పెళ్లి
రిపోర్టర్: మహేష్
స్థలం: జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ శనివారం నాడు సోషల్ మీడియా వేదికగా ఈ జంట తమ వివాహ వార్తను అధికారికంగా ప్రకటించింది. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ నిధి రజ్దాన్‌ను ట్యాగ్ చేస్తూ ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ఫొటోలను పంచుకున్నారు. కాగా గతంలో మొదటి భార్య పాయల్‌తో వివాహం రద్దయిన సంగతి తెలిసిందే.