ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు: ప్రధాని మోదీతో కీలక భేటీ

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదే వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్, కరవు సహాయక నిధులు మరియు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో ఆయన చర్చలు జరపనున్నట్లు సమాచారం.