జాతీయ రహదారిపై కుక్కను ఢీకొన్న బైక్ యువకుడు దుర్మరణం
రిపోర్టర్: రమేష్
స్థలం: కలిగిరి
కలిగిరి మండలంలోని అయ్యపరెడ్డిపాలెం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఎఎస్పేట మండలంలోని అబ్బాసాహెబ్పేట ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రగుంట్ల మాధవ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కావలి నుంచి సొంత గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా రోడ్డుపైకి కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో గాయపడిన బాలాజీని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.