కొత్త లుక్ లో బ్యాట్ మ్యాన్: వైరల్ అవుతున్న షూటింగ్ ఫోటోలు

రిపోర్టర్: గోపి స్థలం: World

ది బ్యాట్ మ్యాన్: పార్ట్ 2 షూటింగ్ సెట్ నుండి రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త బ్యాట్ సూట్ ఫోటోలు బయటకు వచ్చాయి. మెరుగైన కవల్ ఇయర్స్, షైనీ ఆర్మర్ మరియు క్లాసిక్ ఎల్లో బెల్ట్‌తో బ్యాట్ మ్యాన్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మాట్ రీవ్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2028 ఫిబ్రవరి 18న విడుదల కానుంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.