త్వరలోనే నీట్ పీజీ ఫలితాలు విడుదలవుతాయని స్పష్టం చేసిన ఎన్బీఈఎంఎస్

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 30న ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, జైపూర్ లోని సీతాపుర కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రీ-ఎగ్జామ్ నిర్వహించామని ప్రెసిడెంట్ డాక్టర్ అభిజిత్ సేత్ తెలిపారు. ఎలాంటి పేపర్ లీక్ లు లేకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షను నిర్వహించినట్లు ఎన్బీఈఎంఎస్ స్పష్టం చేసింది.