కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం అత్యవసర పిలుపు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అత్యవసర పిలుపు అందింది. పార్టీ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్న ఆమెను బుజ్జగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి పయణమవుతున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు భేటీ కానున్నారు. ఆమెకు కేబినెట్ హోదా కలిగిన కీలక పదవి లేదా కార్పొరేషన్ అప్పగించే అవకాశం ఉంది.