ఉద్దానం కిడ్నీ వ్యాధి అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై చేపట్టిన సమగ్ర అధ్యయనంలో నాలుంట ఒక వంతు మందికి సమస్యలున్నట్లు తేలింది. పరీక్షించిన 3,897 మందిలో 949 మందికి కిడ్నీ వ్యాధులు ఉన్నట్లు నిపుణుల కమిటీ గుర్తించింది. అత్యధికంగా కవిటి మండలంలో కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యంతర నివేదికను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు అందజేసి, ఐసీఎంఆర్‌కు పంపారు.