రామతీర్థం ఆలయంలో ఘనంగా వరుణ యాగం: పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక రైతులు, మత్స్యకారులు మరియు మహిళలతో కలిసి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలోని అన్నదాతలు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేపట్టినట్లు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.