గత జగన్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను మోసం చేశారంటూ కే అచ్చేమ్ నాయుడు ధ్వజం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీకాకుళం

గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువత జీవితాలతో ఆడుకున్నారని శ్రీకాకుళం నేత కే అచ్చేమ్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మించి నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆయన ఆరోపించారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువనేత నారా లోకేష్ తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసా కల్పించిందని ఆయన స్పష్టం చేశారు.