భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.07 కోట్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: Tirupati

తిరుమల శ్రీవారి దర్శనార్థం వారాంతంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.07 కోట్లకు చేరిందని వారు తెలిపారు. ఆ ఒక్కరోజు 83,578 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 31,137 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రికార్డు స్థాయిలో 4.39 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని, క్యూలైన్ల రద్దీ దృష్ట్యా భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది.