రాజాంను స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపు

రిపోర్టర్: సతీష్ స్థలం: రాజాం

పరిసరాల పరిశుభ్రత కోసం ప్రజలందరూ సమష్టిగా స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా రాజాం పాత బస్టాండ్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి రాజాంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.