హైదరాబాద్లో దారుణం: రోహింగ్యా యువతిపై ఐదు నెలలుగా నలుగురి అత్యాచారం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రప్పించిన పద్దెనిమిదేళ్ల రోహింగ్యా యువతిని ఓ నిందితుడు అద్దె ఇంట్లో బంధించి, నలుగురు కలిసి ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్లు కాంచన్బాగ్ ఇన్స్పెక్టర్ జె. బలరాజు తెలిపారు. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని తలుపులు బద్దలు కొట్టి చూడగా బాధితురాలి ఉదంతం బయటపడిందని, దీంతో ముగ్గురిని అరెస్టు చేసి ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.