మత్తు పదార్థాల నివారణపై నేడు సీబీఎస్‌ఈ ప్రత్యక్ష ప్రసారం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో నషా ముక్త్ యువా ఫర్ విక్షిత్ భారత్ పేరుతో ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక టాకథాన్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. పాఠశాల విద్యార్థులలో మాదకద్రవ్యాల నివారణ మరియు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ 45 నిమిషాల సెషన్‌ను నిర్వహిస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎయిమ్స్ న్యూఢిల్లీ నిపుణులు ఇందులో పాల్గొని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు.