ముంబై జెడబ్ల్యూ మారియట్ హోటల్ భోజన బల్లపై బొద్దింక కలకలం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని ప్రముఖ జెడబ్ల్యూ మారియట్ హోటల్ రొమానో రెస్టారెంట్‌లో భోజన బల్లపై బొద్దింక సంచరించడం తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేత్ శనివారం రాత్రి కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లేట్ పక్కనే బొద్దింక తిరుగుతున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఫైవ్‌స్టార్ హోటళ్లలో పరిశుభ్రతా ప్రమాపాలపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.