హైదరాబాద్‌లో భారీ శబ్దం: ఉలిక్కిపడి రోడ్లపైకి పరుగులు తీసిన జనం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందని, భూకంపం వచ్చిందని భావించి ప్రజలు భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. ఉప్పర్‌పల్లి, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు తీవ్ర ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి విచారణ ప్రారంభించారని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.