పూణె మెట్రో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని నరేంద్ర మోదీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: పూణె

పూణె మెట్రో అభివృద్ధి ప్రాజెక్టులను నవంబర్ మూడో తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సుమారు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పింక్ లైన్ గా పిలువబడే మెట్రో లైన్ మూడును ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. హింజేవాడి ఐటీ హబ్ తో పాటు రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.