మిషన్ జ్యోతిర్గమయ: విశాఖలో ఆకలి తీరుస్తున్న నగర పోలీసుల కమ్యూనిటీ ఫ్రిజ్లు

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో ఆకలితో ఉన్న పేదలకు ఉచితంగా ఆహారం అందించే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని VizagCityPolice వెల్లడించారు. ఈ ప్రత్యేక ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్ల ద్వారా నిరాశ్రయులకు ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఆహారం వృథా కాకుండా చూస్తూ ఆకలి కేకలను దూరం చేసేందుకు ఈ సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.