పరువు హత్య కేసులో సంచలన తీర్పు: ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు
రిపోర్టర్: విజయ్
స్థలం: tirupati
కోట మండలం చిట్టేడులో జరిగిన కులాంతర వివాహం పరువు హత్య కేసులో గూడూరు ఏడో అదనపు జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు గడి రామయ్యతో పాటు మరొకరికి జీవిత ఖైదు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కక్షతోనే రాజశేఖర్ను దారుణంగా హతమార్చినట్లు కోట ఎస్సై పవన్కుమార్ తెలిపారు.