సీపీఎస్ రద్దుపై కమిటీ వేస్తామన్న ప్రభుత్వ హామీతో ఉద్యోగ జేఏసీ ఆందోళన విరమణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జరిపిన చర్చలు ఫలించాయి. దసరా పండుగకు రెండు డీఏల మంజూరుకు, పీఆర్సీ నివేదిక తెప్పించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. సీపీఎస్పై ప్రత్యేక కమిటీ వేస్తామని హామీ ఇవ్వడంతో అక్టోబర్ రెండు నుంచి తలపెట్టిన సత్యాగ్రహ దీక్షలను విరమిస్తున్నట్టు జేఏసీ నేత మారం జగదీశ్వర్ ప్రకటించారు.