వరంగల్ లో కోటి తొంబై మూడు లక్షల రూపాయల నోట్లతో వినాయక విగ్రహం అలంకరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: వరంగల్

వరంగల్ లోని శివనగర్ వాసవి కాలనీ వినాయక ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో కోటి తొంబై మూడు లక్షల రూపాయల భారతీయ కరెన్సీ నోట్లతో అలంకరించిన వినాయక విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ధనలక్ష్మి పూజలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన అలంకరణను తిలకించడానికి నలుమూలల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నారు.