కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కడియం శ్రీహరి సంచలన ప్రశ్నలు
రిపోర్టర్: రమేష్
స్థలం: హనుమకొండ
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన సవాల్ విసిరారు.