సుబ్రహ్మణ్యం హత్య కేసు: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

రిపోర్టర్: గోపి స్థలం: దిల్లీ

కాకినాడలో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును కాదని నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ గడువు పొడిగింపునకు, బెయిల్ మంజూరుకు నిరాకరిస్తూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.