కోలీవుడ్ లో కలకలం: దర్శకుడికి ఐఫోన్ బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
రిపోర్టర్: అశోక్
స్థలం: చెన్నై
కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ తన రాబోయే చిత్ర దర్శకుడు రామకుమార్ బాలకృష్ణన్ కు ఐఫోన్ ను బహుమతిగా అందించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. 'ఎస్ కే 27' సినిమాతో తొలిసారిగా వీరిద్దరూ కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అరుదైన బహుమతి పట్ల దర్శకుడు ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయకిగా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు రానున్నాయి.