కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకుకు ఆర్బీఐ రెండో షెడ్యూల్ హోదా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకుకు ఆర్బీఐ రెండో షెడ్యూల్ హోదా కల్పించింది. ఈ మేరకు ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బ్యాంకు ఎండీ, సీఈవో బి.వేణుగోపాలరెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ హోదా ద్వారా బ్యాంకు ఆర్థికంగా బలపడటంతో పాటు వ్యవసాయం, గృహ రంగాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించి సేవలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు.