తల్లి అయిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది: రాధిక ఆప్టే
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
తల్లి అయిన తర్వాత తన బ్రెయిన్ ఫాగ్ మరియు నిద్రలేమి కారణంగా ఒకేసారి రెండు పనులు చేయలేకపోతున్నానని ప్రముఖ నటి రాధిక ఆప్టే తెలిపారు. ఇంటి పనులు, కూతురు సంరక్షణతో పాటు నటనా వృత్తిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా మారిందని ఆమె చెప్పారు. ఎలాంటి పని మనుషులు లేకుండా వంట సహా అన్ని పనులను తానే స్వయంగా చూసుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.