భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అభియోగాల నమోదు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Ranchi
జార్ఖండ్‌లోని రాంచీలో సంచలనం సృష్టించిన ఎనిమిది ఎకరాల భూ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు బుధవారం అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సంజీవ్ సహాయ్ ధ్రువీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన సోరెన్ తరఫున విచారణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసి సాక్షుల విచారణకు రంగం సిద్ధం చేసింది.