యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సర్కార్ పై అఖిలేష్ యాదవ్ నిప్పులు

రిపోర్టర్: నరేష్ స్థలం: Lucknow

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కీలక నియోజకవర్గాల్ లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ జీరోకు పడిపోయిందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనూ ఎస్పీ గెలవడం ఘన విజయమని ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ లో ఈ ఫలితాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.