నా కెరీర్‌లోనే అత్యంత కష్టపడి చేసిన సినిమా ప్యారడైజ్ అంటున్న నాని
రిపోర్టర్: హరి
స్థలం: చెన్నై
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాని మాట్లాడుతూ ఇది తన కెరీర్‌లో అత్యంత హార్డ్ వర్క్ చేసిన సినిమా అని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. తమిళ ఆడియన్స్ సపోర్ట్ ఎప్పటికీ మరువలేనని, అనిరుధ్ మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు బలంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.