వర్ధన్నపేట పాక్స్ నూతన చైర్మన్గా అభిడి రాజారెడ్డి బాధ్యతల స్వీకరణ

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్గా అభిడి రాజారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, నాయకులతో కలిసి ర్యాలీగా కార్యాలయానికి చేరుకుంటారు. రైతుల సంక్షేమానికి, సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.