రైతన్నలకు తీపి కబురు: నేడే ఖాతాల్లోకి భరోసా నిధులు జమ

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలోని అర్హులైన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజన నిధులు జమ అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లక్షా డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతులకు సుఖీభవ కింద ఎవై ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షలు, పీఎం కిసాన్ కింద ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు మొత్తంగా నూట పదిహేడు కోట్ల పదహారు లక్షల రూపాయలు విడుదల చేశారు.