ఫేక్ గురూజీ అంటూ త్రివిక్రమ్ పై నటి పూనమ్ కౌర్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

సినీ పరిశ్రమలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నటి పూనమ్ కౌర్ తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాలలో సంచలన పోస్ట్ పెట్టారు అని తెలిపారు. తన కెరీర్ను ఆయనే ముగించారని, ఆయన ప్రవర్తనను తాను ప్రశ్నించినందుకే ఇలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిగ్గుపడాలంటూ త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.