పెళ్లిలో విషాదం: సరదా కాల్పుల్ లో ఐదేళ్ల బాలుడు దుర్మరణం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Sultanpur
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ జిల్లాలో కలకలం రేగిన ఘటనపై కదిపూర్ సర్కిల్ ఆఫీసర్ వినయ్ గౌతమ్ వివరాలు వెల్లడించారు. సుందర్ మ్యారేజ్ లాన్ లో వివాహ వేడుకకు ముందు జరిగిన సరదా కాల్పుల్ లో అజయ్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్ లో అర్ష్ అనే ఐదేళ్ల బాలుడు పొట్టలోకి తూటా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.