దారకొండలో వార్డుల విభజనపై గ్రామస్థుల నిరసన

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలో వార్డుల విభజన వివాదాస్పదంగా మారింది. శనివారం పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు వార్డుల విభజనను తీవ్రంగా తప్పుబట్టారు.

గ్రామాల ప్రాతిపదికను విస్మరించి ఇష్టారాజ్యంగా వార్డులను విభజించారని వారు ఆరోపించారు. దీనివల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వార్డులను శాస్త్రీయంగా పునర్విభజన చేయాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు.